ధాన్యం సేకరణకు సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. జనవరి 5వ తేదీ నాటికి ఖరీఫ్ సీజన్లో 4,15,066 మంది రైతుల నుంచి 27,00,00 MT ధాన్యం సేకరణ చేసినట్లు వివరించారు. బాధ్యతలు విస్మరించిన గత పాలకులు నాటి ఖరీఫ్ లో 2,12,431 మంది నుంచే ధాన్యం తీసుకొందని అయితే కూటమి ప్రభుత్వం ధాన్యం సేకరణ చేయడమే కాకుండా 24 గం.లోపు రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్నట్లు తెలిపారు. రూ.6,083.69 కోట్లు చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు రైతులకి ధాన్యం డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేదనే వాస్తవాన్ని గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతాంగం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని అన్నారు. రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం అంటూ మనోహర్ పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు