గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సందర్శించారు. లాభాపేక్ష లేని సంస్థ ఇదని కొనియాడారు. ప్రభుత్వం అమలుచేస్తోన్న “డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం” కోసం 30,000 మంది బడి పిల్లలకు ఇక్కడి నుండి దాదాపు 25 ఇన్సులేటెడ్ కంటైనర్లలో భోజనం సరఫరా అవుతుంది. ఇంత మందికి ఆహారం తయారు చేస్తున్నా కిచెన్ ను వాళ్ళు నిర్వహించే తీరు, శుభ్రత చాలా బాగుందని ఆమె ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 24 లక్షలకు పైగా బడి పిల్లలకు ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారానే ఆహారం పంపిణీ చేయబడుతోందని అక్షయపాత్ర మంగళగిరి ప్రెసిడెంట్ శ్రీ వంశీధర దాస వివరించారు . అక్కడ బియ్యం శుభ్రపరిచే యంత్రాన్ని భువనేశ్వరి ప్రారంభించారు.దీని పట్ల ఆమె హార్షం వ్యక్తం చేశారు.
Previous Articleఐసీసీ ప్రకటించిన ఇయర్ ఆఫ్ ది టీమ్స్ ఇవే..!
Next Article ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి: ఏపీ సీఎం చంద్రబాబు