ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడం, కొత్త ఓటర్లను గుర్తించడం, ఓటర్లకు ఎన్నికల గురించి అవగాహన కల్పించడమే ప్రధానోద్దేశంగా జనవరి 25న ప్రతియేటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని దేశం జరుపుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజాస్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2025, జనవరి నాటికి 99.1 కోట్లకు పెరిగారు. ఈ సంఖ్య త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది. దీంతో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ నిలవనుంది. ఈ సంవత్సరం ఓటరు దినోత్సవానికి సంబంధించి ఓటును మించింది ఇంకొకటి లేదు.. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను (NOTHING LIKE VOTING, I VOTE FOR SURE) అనే ఇతివృత్తంతో ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు