అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొమిటోని చెరువు వద్ద చేపట్టిన ఆకస్మిక తనిఖీలో భారీ మొత్తంలో ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు , సిబ్బందిని డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ట్వీట్ చేశారు.
195 ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో మరియు అక్రమ స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది నేరస్థులను పట్టుకోవడంలో కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మరియు రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు.
ఈ ఆపరేషన్ మన విలువైన సహజ సంపదను రక్షించడంలో మన బృందాల యొక్క తిరుగులేని నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో మీ అంకితభావం, అప్రమత్తత మరియు సత్వరం స్పందించడం అభినందనీయమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వన్యప్రాణులు మరియు అటవీ నేరాలను అరికట్టేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ఈ విజయం భవిష్యత్ తరాలకు మన అడవులను సంరక్షించడానికి నిరంతర అప్రమత్తత మరియు చురుకైన అమలుకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
195 ఎర్రచందనం దుంగలు స్వాధీనం…8మంది అరెస్టు: అధికారులను అభినందించిన డిప్యూటీ సీఎం
By admin1 Min Read
Previous Articleతగ్గిన రెపో రేటు: ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు
Next Article రతన్ టాటా వీలునామాలో రహస్య వ్యక్తి…!

