ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుండి జరగనున్నాయి. 24న ఉదయం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 15 వర్కింగ్ డేస్ లో అసెంబ్లీ సమావేశాలు జరిపే యోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ సమావేశం అనంతరం సభను ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు.
Previous Articleగూగుల్ కు పోటీగా ‘చాటీ జీపీటీ సెర్చ్’…!
Next Article ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం…!