ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విఅవాస్తవాలతో అలజడి సృష్టించవద్దని అన్నారు. ఏలూరులో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది అని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధం. బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరో చెప్పిన మాటలను, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండి. వైరస్ సోకిన కోళ్ళ విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నిటినీ తీసుకుంది. ప్రజలెవరూ ఈ విషయంలో భయాందోళనలకు గురికావద్దని తెలిపారు. ఉంగుటూరు మం. బాదంపూడిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో వైరస్ సోకిన కోళ్లను, గుడ్లను పూడ్చిపెట్టామని కోళ్ల ఫారాల నుండి కిలోమీటర్ పరిధిని ఇన్ఫెక్షన్ జోన్గా ప్రకటించి రెడ్ అలర్ట్ జారీ చేశామని జిల్లా అధికారులు తెలిపారు.
మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది అని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధం: అధికారులు
By admin1 Min Read