ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జీబీఎస్ వైరస్ విజృంభిస్తోంది.కాగా నాలుగు రోజుల్లో 7కు పైగా జీబీఎస్ వైరస్ కేసులు నమోదయ్యాయని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి వెల్లడించారు.అయితే వారిలో ఇద్దరి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారన్నారు.జిబిఎస్ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు. దీనికి సంబంధించి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
వ్యాధి సోకిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.ఒకరు వెంటిలేటర్‌పై, మరొకరు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు.గతంలో ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చి పోయిన కొన్ని రోజుల తర్వాత ఈ వ్యాధి సోకుందని తెలిపారు.ఇది ప్రాణాంతకం కాదని ఒకరి నుండి మరొకరి సోకదని తెలిపారు.ఎలాంటి ఐసోలేషన్ అవసరం లేదని,తొలుత నాడి వ్యవస్థపై ప్రభాశం చూపుతుందని రమణ యశస్వి పేర్కొన్నారు.