భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాగదీపిక పుచ్చా బ్లాక్ హోల్స్ మీద చేసిన పరిశోధనలలో ఆమె సాధించిన ఆవిష్కరణల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు హార్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆమెకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గుంటూరులోని తెనాలికి చెందిన ఆమె ప్రపంచ వేదికపై తమదైన ముద్ర వేసిన ప్రముఖ మహిళల జాబితాలో చేరిందని కొనియాడారు. ఆమె మరియు ఆమె బృందం మరిన్ని విజయాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇక రాగ దీపిక వారి టీమ్ చిన్న గెలాక్సీలు వాటిలోని బ్లాక్ హోల్స్ పై చేసిన రీసెర్చ్, వాటి ఫలితాలకు గుర్తింపు లభించింది.
భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాగదీపికకు సీఎం చంద్రబాబు అభినందనలు
By admin1 Min Read
Previous Articleకోచ్ గంభీర్ కు మద్దతుగా నిలిచిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
Next Article మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన..!