ఏపీలోని నౌకాశ్రయాన్ని కలిపేలా ప్రత్యేక రైలు,రోడ్డు రవాణా మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…హైదరాబాద్ ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మారిందని అన్నారు.ఈ సదస్సుతో హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు వచ్చిందని తెలిపారు.
అయితే ప్రపంచ ప్రసిద్ధ ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని చెప్పారు.పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా తమ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.తెలంగాణాలో ఉన్నత విద్యపై పెట్టుబడులు బాగా పెరిగాయని వివరించారు.ఎంతోమంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లను తయారు చేశామని అన్నారు.కాగా నిపుణుల కృషితో జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.
Excited to kick-off BioAsia 2025!
In my inaugural address today, highlighted how #Hyderabad has transformed into a global life sciences capital in the last 30 years, driving India's rise in healthcare innovation.
I shared my vision to transforming Hyderabad into one of the… pic.twitter.com/dskZA4sDzu
— Revanth Reddy (@revanth_anumula) February 25, 2025

