ఏపీ లోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2025-26ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం. అంతా అంకెల గారడి – అభూత కల్పన అని ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు . సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు ఇతర హామీలకు ఎగనామం పెట్టారని ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్‌తోనే నిరూపితం అయ్యింది. సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్ అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.రాష్ట్ర ప్రజలను మోసం చేసి , ఎన్నికల హామీలను గాలికి వదిలేసి మసి పూసి మారేడు కాయ చేశారని ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
అన్నదాత సుఖీభవ పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం అరకొరనేనని అన్నారు. తల్లికి వందనం పథకానికి నిధుల్లో కోత పెట్టారు. దీపం 2 పథకానికి ఏడాదికి అవసరం అయిన నిధులు సంఖ్య రూ.4500 కోట్లు. బడ్జెట్‌లో ఉచిత సిలిండర్ల పథకానికి కేటాయింపులు రూ.2601 కోట్లు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదని రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో నెలకు రూ.350 కోట్లు కేటాయించే పథకానికి నిధులు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి మనసు రాలేదని విమర్శించారు. నెలకు రూ.1500 ఇచ్చే మహాశక్తి పథకాన్ని మాయం చేశారు. కోటిన్నర మంది మహిళలను అన్యాయం చేశారన్నారు. రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి ఒక్క రూపాయి కేటాయించకుండా డ్వాక్రా మహిళలను మోసం చేశారు. నిరుద్యోగ భృతి పథకం ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను వంచించారు. రాష్ట్ర రాజధానికి ఒక్క రూపాయి కేటాయించకుండా అప్పులతోనే అమరావతి కట్టాలని చూడటం మీ అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సంఖ్య ఘనం – కేటాయింపులు శూన్యం: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin2 Mins Read
Previous Articleమహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు బెదిరింపు కాల్స్…!
Next Article ‘సెబీ’ కొత్త సారథిగా తుహిన్ కాంత పాండే…!