కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) వద్ద విద్యార్థుల నిరసన కొనసాగుతోంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల భూములను వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.జీవ వైవిధ్యాన్ని కాపాడాలని,యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపడుతున్నారు.అయితే,బుధవారం ఉదయం వేలాది మంది పోలీసులు యూనివర్సిటీని చుట్టుముట్టి,క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.విద్యార్థులను లోపలే నిర్బంధించడంతో పాటు,బయటివారిని ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు.దీంతో విద్యార్థులు,ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన బాట పట్టారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేయడం విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది.పోలీసుల తీరుపై మండిపడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొనగా, దీనిపై మరింత రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది.
Previous Articleబీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా నటుడు సుమన్
Next Article హెచ్‌సీయూ భూ వివాదంపై స్పందించిన నటి సమంత…!