గత కొన్ని రోజులుగా ప్రపంచం ఎదురుచూస్తున్న అమెరికా పరస్పర సుంకాలకు(రెసిప్రోకల్ టారిఫ్స్) సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని అనేక దేశాలపై పరస్పర సుంకాలు విధించారు. పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పెంచిన ఈ సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను ప్రకటించారు. ఈ రోజును ‘లిబరేషన్ డే’గా అభివర్ణించిన ట్రంప్, ఈ ప్రత్యేక సమావేశానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ రంగ కార్మికులను ఆహ్వానించారు. ఇక భారత్‌తో పాటు చైనాపై భారీగానే పరస్పర సుంకాలను విధించారు. అయితే, ఆయా దేశాలు తమ నుంచి వసూలు చేస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు, తద్వారా తాము వారిపై దయతో ఉన్నామని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. వీటిని ‘రాయితీ పరస్పర సుంకాలు’ అని పేర్కొన్నారు. ఇక భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం దిగుమతి సుంకాన్ని అమెరికా వసూలు చేస్తుందని పేర్కొన్నారు.
LIBERATION DAY RECIPROCAL TARIFFS 🇺🇸 pic.twitter.com/ODckbUWKvO
— The White House (@WhiteHouse) April 2, 2025