ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేటి ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. కాగా, అగ్నిప్రమాద ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాద ప్రదేశాన్ని సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి అనిత,జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. అంతకుముందు ఏపీ హోం మంత్రి అనిత అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని జీఏడీ, సీఆర్డీఏ అధికారులు తెలిపారు.ఫోరెన్సిక్ నివేదిక అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తుల ఇలాంటివి జరగకుండా చర్యలకు ఆదేశించారు.
Previous Articleభారత ప్రధాని మోడీ-బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత యూనస్ కీలక భేటీ
Next Article 76 వేల దిగువకు సెన్సెక్స్…23 వేల దిగువకు నిఫ్టీ