ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొబైల్ వాహానం ద్వారా పాస్ పోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి. పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లలేని వారు, మారుమూల ప్రాంత ప్రజలు తమ తమ స్వస్థలాలోనే ఉండి ఈ వెహికల్ సాయంతో పాస్ పోర్టు పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ వ్యాన్ ఎప్పుడు, ఎక్కడికి వస్తుందో అధికారులు సంబంధిత వెబ్ సైట్ లో ముందుగానే వివరాలు ఉంచుతారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని, వ్యాన్ వద్దకు వెళ్తే సరిపోతుంది. అక్కడ సర్టిఫికెట్లు పరిశీలించి, ఫింగర్ ప్రింట్స్, ఫొటోలు తీసుకుని ప్రక్రియ పూర్తి చేస్తారు. త్వరలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Previous Articleధనుష్ – మారి సెల్వరాజ్ కొత్త చిత్రం ప్రకటన…!
Next Article పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి సినిమాలో టబు…!