జీవితమంతా మొక్కలు నాటుతూ పర్యావరణం కోసం ఎనలేని కృషి చేసిన ‘వనజీవి రామయ్య’ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. కోటికి పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తదితరులు తమ విచారం వ్యక్తం చేశారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యాను. ఒక వ్యక్తిగా ఉండి… పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకం. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. వనజీవి రామయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
మంత్రి నారా లోకేష్:
వనజీవి రామయ్య గారి మరణం బాధాకరం. “వృక్షో రక్షతి రక్షితః” అన్న ఆయన జీవన సందేశమే ఆయన జీవిత సారాంశం. చెట్లను మన వంశపారంపర్యంగా భావించి, వాటిని సంరక్షించడం ద్వారా మన భవిష్యత్తును కాపాడతామని చెప్పిన ఆయన, అసలైన పర్యావరణ యోధుడు.
ఆయన శ్రమ, త్యాగం వలన ఎన్నో వేల ఎకరాల అడవులు పునరుద్ధరించబడ్డాయి. పద్మశ్రీ అవార్డు ఆయన సేవలకు ఒక గుర్తింపు మాత్రమే, కానీ ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. మనందరం ఆయన చూపించిన మార్గాన్ని అనుసరిస్తేనే ఆయనకు నిజమైన నివాళి అవుతుంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు