ఆంధ్రప్రదేశ్ లో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేడు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్పీ సిసోడియా చేనేత, జౌళి పరిశ్రమల మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీసీఎస్ఏ, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కు ఏపీ హెన్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధిశాఖ కమిషనర్ గా ముత్యాలరాజును నియమించింది. ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్, రైతు బజార్ల సీఈవోగా కె.మాధవీలత, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా గౌతమి, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ గా నీలకంఠారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు