సమాజ సంస్కరణకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారి 177వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలుగు నాటకరంగ దినోత్సవం – 2025” కార్యక్రమం జరిగింది. నాటక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి రాష్ట్ర స్థాయిలో ముగ్గురికి కందుకూరి ప్రతిష్ఠాత్మక రంగస్థల పురస్కారాలు, అలాగే జిల్లా స్థాయిలో 26 జిల్లాలకు గాను 107 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలను అందజేశారు. మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులు అందుకున్న కళాకారులకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. త్వరలో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు పున: ప్రారంభిస్తామన్నారు. మన రాష్ట్రంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని వివరించారు. కవులు, కళాకారులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అవార్డుల ఎంపిక లో పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు పేర్కొన్నారు.
నాటక రంగానికి పూర్వ వైభవం…రాష్ట్ర స్థాయిలో ముగ్గురికి, జిల్లా స్థాయిలో 107మందికి కందుకూరి పురస్కారాలు
By admin1 Min Read

