తమిళ నటుడు,రాజకీయ నాయకుడు దళపతి విజయ్‌పై ఉత్తరప్రదేశ్ బరేలీలోని సున్నీ ముస్లిం బోర్డు ఫత్వా జారీ చేసింది.ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఈ ఫత్వాను ప్రకటించారు.విజయ్ గత చర్యలు ఆయనను ఇస్లాం వ్యతిరేకిగా చూపిస్తున్నాయని ఆరోపించారు.రంజాన్ సందర్భంగా జరిగిన ఇఫ్తార్ విందుకు మద్యం ప్రియులు,జూదగాళ్లను ఆహ్వానించడమే తప్పు మాత్రమే కాదు,పాపం కూడా అని బోర్డు స్పష్టం చేసింది.ముస్లిం సమాజం ఇలాంటి వారిని నమ్మకూడదని,మతపరమైన వేడుకలకు ఆహ్వానించకూడదని తమిళనాడు ముస్లింలను కోరింది.
విజయ్ రాజకీయాల్లోకి వచ్చే క్రమంలో ముస్లిం సెంటిమెంట్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని మౌలానా రజ్వీ ఆరోపించారు.‘ది బీస్ట్’ సినిమాలో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించారని,దానివల్ల ముస్లిం సమాజం అపహాస్యానికి గురవుతోందని అన్నారు.ఇఫ్తార్‌కు ఇస్లాం విలువలను అవమానించే వారిని పిలిచి, రంజాన్ పవిత్రతను దిగజార్చారన్నారు. ముస్లింలు విజయ్‌కు దూరంగా ఉండాలని, ఆయన కార్యక్రమాలకు హాజరుకాకూడదని హెచ్చరించారు. అంతేకాకుండా విజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తమిళనాడులోని ముస్లింలకు సూచించారు.ఈ అంశం తమిళ రాజకీయాల్లో వేడి రేపే అవకాశముంది.