దేశ సేవలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైయస్ఆర్ సీపీ అధినేత జగన్ పరామర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని మురళీ నాయక్ ఇంటికి వెళ్లి.. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దేశం కోసం అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైయస్ఆర్సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందజేస్తామని తెలిపారు. మురళీ నాయక్ కుటుంబానికి అన్నివిధాలుగా తోడుగా ఉంటామని అన్నారు. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైసీపీ అధినేత జగన్ పరామర్శ…రూ.25 లక్షలు సాయం ప్రకటన
By admin1 Min Read
Previous Articleఆదంపూర్ ఎయిర్ బేస్ సందర్శించి, సైనికులతో మాట్లాడిన ప్రధాని మోడీ
Next Article సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల..!