ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్ లలో ఒకటైన ఆదంపూర్ ఎయిర్ బేస్ ను నేడు సందర్శించారు. సైనికులతో మాట్లాడారు. అదాంపూర్ వెళ్లి మన ధైర్యవంతులైన వైమానిక యోధులను మరియు సైనికులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పం మరియు నిర్భయతకు ప్రతిరూపంగా నిలిచే వారితో ఉండటం చాలా ప్రత్యేకమైన అనుభవం. మన దేశం కోసం మన సాయుధ దళాలు చేసే ప్రతిదానికీ భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందని ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ఇటీవలే భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్ పని పట్టిన సంగతి తెలిసిందే. భారత సాయుధ దళాలు తమ సత్తా చాటాయి. అనంతరం భారత్ పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. గత రాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ తదనంతర పరిణామాలు గురించి జాతినుద్దేశించి ప్రసంగించారు. పాక్ కు తగిన బుద్ధి చెప్పినట్లు తెలిపారు. భారత్ పై మళ్లీ దాడిచేస్తే తగిన సమాధానం చెబుతామన్నారు. అణుబాంబుల పేరుతో భారత్ ను ఎవరూ బెదిరించలేరని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరుమొదలుపెట్టామని స్పష్టం చేశారు. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలు ధ్వంసం చేశామని తెలిపారు. మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిందని పేర్కొన్నారు.
ఆదంపూర్ ఎయిర్ బేస్ సందర్శించి, సైనికులతో మాట్లాడిన ప్రధాని మోడీ
By admin1 Min Read