విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ట్రైన్ పట్టాలెక్కితే దాదాపు 3 గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. ఈ రైలు బెంగళూరు వెళ్లేవారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్. వారంలో మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు నడిచే ఈ రైలు (20711) విజయవాడలో 5.15 గంటలకు బయలుదేరి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర స్టేషన్ల మీదుగా ఎస్ఎంవీటీ బెంగళూరు 14.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ రైలు (20712) బెంగళూరులో 14.45 గంటలకు ప్రారంభమై విజయవాడ 23.45 గంటలకు వస్తుంది.
Previous Articleలక్నో సూపర్ జెయింట్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ సునాయస విజయం
Next Article విడుదలైన ‘వార్-2’ టీజర్… అదరగొడుతున్న ఎన్టీఆర్