ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అరెస్టు నుండి తప్పించుకు తిరుగుతున్న ఆయనను తాజాగా బెంగళూరు సమీపంలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వెంకటాచలం పీహెచ్‌సీకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఖనిజ సంపదను వెలికితీసి, అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలపై గనులు, భూగర్భ వనరుల శాఖ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది.
Previous Articleమలేసియా మాస్టర్స్ సూపర్ 500లో రన్నరప్ గా నిలిచిన శ్రీకాంత్
Next Article ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు