ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది! సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో చెయ్యలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశాం. అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ప్రతినిత్యం శ్రమిస్తామని స్పష్టం చేశారు. ప్రజాసేవలో నిమగ్నమై పని చేస్తున్నామన్నారు. సుపరిపాలనకు సహకరించిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది!: మంత్రి లోకేష్
By admin1 Min Read