భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన శుభాంశు మిగిలిన ముగ్గురు ఆస్ట్రోనాట్ లతో కలిసి సురక్షితంగా భూమిని చేరారు.నిన్న వీరు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా తిరుగు పయనమయ్యారు. నేటి మధ్యాహ్నం 3.01 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్రతీరంలో వీరి డ్రాగన్ వ్యోమనౌక దిగింది. భూమిని చేరుకున్న వీరిని నాసా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు పంపించనుంది. శుభాంశుతో పాటు ఉన్న పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్ కపులు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది. అందుకోసమే వారం రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. 18 రోజుల అంతరిక్ష యాత్రలో శుక్రా బృందం అనేక పరిశోధనలు జరిపింది. భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ 1984లో రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర చేసి మరో చరిత్ర సృష్టించాడు. అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియమ్ చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ఎక్స్-4 మిషన్‌లో భాగంగా ఆయన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. తద్వారా రోదసి యాత్ర చేపట్టిన రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు