వెలగపూడి సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన అధికారులతో ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆక్వాకల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని ఆదేశించారు. లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేయాలని, రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా 5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధి, సుస్థిరమైన అక్వాకల్చర్, రైతుల ఆదాయ పెంపు, దేశీయ మార్కెట్ బలోపేతం వంటి లక్ష్యాలకు తోడ్పడతాయని, రొయ్యల రైతులకు కూటమి ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు,ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు మేలు జరిగేలా సుంకాల భారంపై సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. సుంకం తక్కువ ఉన్న దేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తే రైతులకు నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. చికెన్ వ్యర్ధాలను చేపల చెరువులకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. చెరువుల యజమానులపై కేసులు నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
రొయ్యల రైతులకు కూటమి ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు: మంత్రి అచ్చెన్నాయుడు
By admin1 Min Read