ఆంధ్రప్రదేశ్ కు తుఫాను ముప్పు తప్పింది. ఈమేరకు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా మారలేదని ఈరోజు సాయంత్రానికి ఇది వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. ఇది ఈనెల 28 సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కి.మీ, నాగపట్టణానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. కాగా 30 ఉదయం నాటికి కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. తుఫాను ముప్పు లేకపోయినప్పటికీ వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Previous Articleమనలో చాలామంది డిప్రెషన్ తో ఇబ్బంది పడుతున్నారు : రెహమాన్
Next Article వినియోగదారుల సౌకర్యార్థం ఈ-దాఖిల్ పోర్టల్