ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు నియమించబడ్డారు. ఈమేరకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ఇక తాజా నిర్ణయంతో జనసేన నుండి నలుగురికి ఏపీ మంత్రివర్గంలోకి స్థానం లభించినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి బీద మస్తాన్ రావు, సాన సతీష్ , భారతీయ జనతా పార్టీ నుండి ఆర్. కృష్ణయ్య పేర్లు ప్రకటించారు. ఇక జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనదని చంద్రబాబు పేర్కొన్నారు.
Previous Articleజపాన్‌లో ఒక్కరోజు విద్యార్థి @ రూ.17 వేలు
Next Article ఏపీ ఈ.ఎస్.ఐ హాస్పిటల్స్ పరిధిలో 13.86 లక్షల మంది