2024 ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీ నుండి చాలా మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా మరో కీలక నేత ఆపార్టీకి గుడ్ బై చెప్పేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (ముత్తంశెట్టి శ్రీనివాసరావు) వైసీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు వై.ఎస్.జగన్ కు రాజీనామా లేఖను రాశారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం వలన భీమిలి నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలకు మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాదమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. మీరు ఇచ్చిన అవకాశానికి నా ధన్యవాదములు నా రాజీనామా ను ఆమోదించి వలసిందిగా కోరుచున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు.
Previous Articleనేరుగా రాజమహేంద్రవరం-ఢిల్లీ విమాన సర్వీసు ప్రారంభం
Next Article ఆసక్తికరంగా ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్:13వ రౌండ్ డ్రా