సుప్రసిద్ధ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలోని హాస్పిటల్స్ చేరారు. చికిత్స పొందుతూనే ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తబలా మ్యాస్ట్రోగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిచెందారు. జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబయిలో జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడే జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుండే తండి బాటలో నడిచారు.
*తొలి సంగీత కచేరీ ఎప్పుడు ఇచ్చారంటే?*
జాకీర్ హుస్సేన్ 11 ఏళ్ల వయసులోనే అమెరికాలో తొలి సంగీత కచేరీ ఇచ్చారు. తన ప్రస్థానంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పౌర పురస్కారాలతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆయన కెరీర్లో 5 గ్రామీ అవార్డులు అందుకున్నారు.
‘వాహ్ తాజ్’ యాడ్ తో ఎందరికో సుపరిచితుడు
తబలా వాయిద్య కారుడు జాకీర్ హుస్సేన్ అనగానే 90ల్లో చేసిన ‘వాహ్ తాజ్’ యాడ్ గుర్తొస్తుంది. ఒక ప్రముఖ టీ పొడి కంపెనీకి చేసిన వాణిజ్య ప్రకటనతో ఆయన మరింత మందికి చేరువయ్యారు. అందులో ఆయన తబలా వాయించిన విధానం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. జాకీర్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సంగీతాభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ నివాళులు తెలుపుతున్నారు.