పౌర సరఫరాల శాఖలో గత 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు చేసిన వాటిపైన దృష్టి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా సంస్కరణలు తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతూ ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ అన్నారు. మచిలీపట్నంలో జెఎస్ గోడౌన్స్ నుండి ప్రజలకు చెందాల్సిన 4840 బియ్యం బస్తాలు దారి మళ్ళినట్టు విచారణలో నిర్ధారణకు వచ్చిందని పేర్కొన్నారు. పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ కి పాల్పడిన వారికి కనీసం 6 నెలలు జైలు శిక్ష.పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ ని పీడీ యాక్ట్ కిందకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏ పోర్ట్ అయినా, ఏ కంటైనర్ అయినా, ఏ లారీ అయినా అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్ రైస్ దొరికింది అంటే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.
విచారణలో నిమగ్నమైన పోలీసు వ్యవస్థ, రెవెన్యూ సిబ్బంది, పౌరసరఫరాల సిబ్బంది కలిసి సమన్వయం పని చేస్తున్నారు. ఎందుకు ప్రత్యేకంగా ఈ గోడౌన్ నుండి అవకతవకలు జరిగాయి అని విచారణ జరుపుతున్నారని వెనుక ఎవరైనా ఉండనివ్వండి. అంతిమంగా న్యాయబద్ధంగా విచారణ జరిగే విధంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని వివరాలు బయట పెడతామని పేర్కొన్నారు.
అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్ రైస్ దొరికింది అంటే చట్టపరమైన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహార్
By admin1 Min Read