జమిలి ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, దీనిని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఏపీసీసీ చీఫ్ షర్మిల జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. పూర్తి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని ఆమె’ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ఇది నియంతృత్వ చర్య అని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్‌సభలో ఓటింగ్‌తో తేలింది. కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి..? ఇందులో ఏమన్నా అర్థముందా..? అని ప్రశ్నించారు. ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని దుయ్యబట్టారు.
జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాల వ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే జమిలి ఎన్నికల బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహకరించిందని స్పష్టం చేశారు.
అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే: ఏపీసీసీ చీఫ్ షర్మిల
By admin1 Min Read