రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రాజధాని అవసరమేనని స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని అలాగే దాంతో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రజలపై భారం లేకుండా అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. గతంలో తాము తీసుకొచ్చిన పరిశ్రమలు వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లాయని మరల పరిశ్రమలు తిరిగి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 15 నాటికి రాజధాని నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు వివరించారు. వైసీపీకి రాజధానిపై కక్ష తీరలేదని అందుకే విష ప్రచారం చేస్తుందని విమర్శించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు: ఏపీ మంత్రి నారాయణ
By admin1 Min Read