నూతన సంవత్సర వేడుకలకు అయోధ్య రామ మందిరం అంగరంగ వైభవంగా సిద్ధం అవుతోంది.బాల రాముడిని ప్రతిష్టించి సంవత్సరం కావొస్తుండటంతో భారీగా భక్తులు తరలి రానున్నారని అధికారులు తెలిపారు.ఎటువంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
“భక్తులకు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధంగా ఉంది. జనవరి 15 వరకు హోటల్ గదులన్నీ ముందుగానే బుక్ అయ్యాయి” అని స్థానిక హోటల్ యజమాని అంకిత్ మిశ్రా తెలిపారు.చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే గదుల లభ్యత ఉన్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఇదే అదనుగా కొందరు హోటళ్ల యజమానులు ఒక్కరోజుకు రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రఖ్యాత స్థలాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాలు కూడా పెంచుతున్నట్లు చెప్పారు.