దేశరాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ‘పూజారీ గ్రంథీ సమ్మాన్ యోజన’ కింద ప్రతి అర్చకుడికి, గురుద్వారాల్లోని గ్రంథీలకు నెలకు రూ.18వేలు గౌరవ వేతనంగా అందజేస్తామని ప్రకటించారు.ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని అన్నారు.తానే ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తానని తెలిపారు.మహిళా సమ్మాన్ యోజనను ఎలా అయితే బీజేపీ ఆపాలని చూస్తుందో అలా ఈ పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే వారికి మహా పాపం తగులుతుందన్నారు.
Previous Articleఆంజనేయస్వామికి లక్ష వడమాల…!
Next Article “జెనరేషన్ బీటా”కు స్వాగతం..!