దేశంలో కోట్లాది మంది హిందువుల స్వప్నం సాకారమైన రోజు నేడు. అయోధ్యలో రామమందిరం నిర్మితమై బాల రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈరోజుకి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
అయోధ్యలో రామ్ లల్లాకు పట్టాభిషేకం జరిగిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు. శతాబ్దాల త్యాగం, తపస్సు మరియు పోరాటాల తర్వాత నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వం. ఈ దివ్యమైన మరియు గొప్ప రామాలయం అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క సంకల్పాన్ని సాధించడంలో గొప్ప ప్రేరణగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను అంటూ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
ఇక గత ఏడాది 22 జనవరి 2024 రోజు కూర్మ ద్వాదశి అని కూడా పిలిచే పుష్య మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి నాడు అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కూర్మద్వాదశి జనవరి 11న వచ్చింది. కాబట్టి ఈరోజు వార్షికోత్సవాన్ని జరుపుతున్నట్లు ట్రస్ట్ తెలిపింది.
అయోధ్య రామమందిరం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పోస్ట్
By admin1 Min Read