రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయమని, సమన్వయ లోపం లేకుండా లక్ష్య సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అధికారులకు ఈసందర్భంగా దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనను ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పీపీఏలను రద్దు చేశారు. పలు పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారు. 1995-2004తో పోల్చుకుంటే రాష్ట్రాల మధ్య పోటీ పెరిగిందని ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, భూకేటాయింపులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని సూచించారు. అందరం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలుపుదామని కోరారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం: మంత్రి నారా లోకేష్
By admin1 Min Read