హైదరాబాద్ నుండి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారి ప్రయాణం సమయం కొంతమేరకు తగ్గనుంది. హైదరాబాద్ నుండి వస్తున్న వాహనాలను నిన్నటి నుండి విజయవాడ సమీపంలో నిర్మించిన వెస్ట్ బైపాస్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇప్పటి వరకు వెహికల్స్ విజయవాడ లోపల నుండి వెళ్తున్నందున, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ఒక్కోసారి 2-3 గంటల సమయం పడుతుంది. ఇకపై ఈ కష్టాలు తీరి కొద్దిగా ఉపశమనం లభించనుంది. విజయవాడ శివారులోని గొల్లపూడి నుండి చిన్నఅవుటపల్లి వరకు 30 కి.మీ. మేర కొత్తగా ఆరు వరుసల బైపాస్ నిర్మాణానికి 2020లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. తాజాగా అధికారులు సంక్రాంతి రద్దీ నేపథ్యంలో నిన్నటి నుండే రెండు వైపులా రాకపోకలకు అనుమతిస్తున్నారు. గొల్లపూడి- చిన్నఅవుటపల్లి మధ్య ప్రయాణం కేవలం గంటలోనే పడుతుంది. త్వరలోనే ఈ మార్గంలో పూర్తిస్థాయిలో వెహికల్స్ ను అనుమతించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు