స్వామీ వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో జరిగిన ‘వికసిత్ భారత్ యువ నేతల సమ్మేళనంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. లక్షమంది యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చే లక్ష్యంలో భాగంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. యువత యెక్క శక్తిసామర్థ్యాలే మన దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుస్తాయని పేర్కొన్నారు. యువతపై స్వామీ వివేకానందకు ఎంతో విశ్వాసం ఉండేదని, అన్ని సమస్యలకూ యువతరమే పరిష్కారం చూపగలదనేది ఆయన విశ్వాసమని తెలిపారు. ఆ మాటలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. దేశం మరింత ముందుకు సాగాలంటే భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ప్రస్తుతం మనం చేస్తున్నది అదే. కాలం కంటే ముందుకు వెళ్లేలా వివిధ రంగాల్లో భారీ లక్ష్యాలను భారత్ సాధిస్తోందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రధాని మోడీ దాదాపు 6 గంటలసేపు ఆరు గంటలసేపు యువతతో అక్కడే గడిపారు. యువత నిర్వహించిన ఎగ్జిబిషన్ ను ఆసక్తిగా తిలకించారు. వారి ఆలోచనల్ని విన్నారు. వారితో కలిసే భోజనం చేశారు. తన ఆలోచనల్ని వారితో పంచుకున్నారు.
యువత శక్తిసామర్థ్యాలే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుస్తాయి
By admin1 Min Read

