ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా నేడు ఘనంగా ప్రారంభమైంది. పవిత్ర నదులైన గంగా, యమునా, సరస్వతీ త్రివేణి సంగమ ప్రదేశం ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులు పవిత్ర స్నానాలు పూజలతో ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంది. 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి కోట్ల మంది భక్తులు, పర్యటకులు రానున్నారు. మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుండి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలు కల్పించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ప్రకటించారు.
కుంభమేళా ప్రారంభంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. “భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని పేర్కొన్నారు . ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతోమందిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుందని పవిత్ర స్నానాలు ఆచరించి, భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు అశేషజనం రావడం ఎంతో సంతోషంగా ఉందని మోడీ పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు