కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లోని AIIMS బయట దేశవ్యాప్తంగా ఉన్న పేద రోగులు మరియు వారి కుటుంబాలు చలి, ధూళి మరియు ఆకలి తో AIIMS వెలుపల పడుకోవలసి వస్తుందని అన్నారు. ఈమేరకు అక్కడ ఉన్న వారిని పరామర్శిస్తూ ఉన్న ఒక వీడియోను తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేశారు.
AIIMS బయట నరకం!
దేశవ్యాప్తంగా ఉన్న పేద రోగులు మరియు వారి కుటుంబాలు చలి, ధూళి మరియు ఆకలి తో AIIMS వెలుపల పడుకోవలసి వస్తుంది ఆశ్రయం లేదు, ఆహారం లేదు, మరుగుదొడ్డి లేదు, తాగునీరు లేదు. పెద్దఎత్తున వాదనలు వినిపించే కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఈ మానవతా సంక్షోభంపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
AIIMS के बाहर नरक!
देशभर से आए ग़रीब मरीज और उनके परिवार AIIMS के बाहर ठंड, गंदगी और भूख के बीच सोने को मजबूर हैं।
उनके पास न छत है, न खाना, न शौचालय और न पीने का पानी।
बड़े-बड़े दावे करने वाली केंद्र और दिल्ली सरकार ने इस मानवीय संकट पर आंखें क्यों मूंद ली हैं? pic.twitter.com/wwnm8Fc3i8
— Rahul Gandhi (@RahulGandhi) January 18, 2025