బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనతో మహారాష్ట్ర సర్కార్‌పై విపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి.రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి.దీనిపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు.సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తికి అదొక సెలబ్రిటీ ఇల్లన్న సంగతి తెలియదని అన్నారు.ముంబైలో శాంతిభద్రల విషయమై ప్రభుత్వంపై బురద చల్లేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.వాస్తవంగా సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో నిందితుడికి అది ఓ సెలబ్రిటీ ఇల్లన్న సంగతి తెలియదు.బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి కోల్‌కతాలో నివాసం ఉంటున్నారు.
తర్వాత కుటుంబంతోపాటు ముంబైకి మకాం మార్చాడు.కేవలం దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లోకి అతడు వచ్చాడు.అంతే కానీ నిందితుడికి అది ఎవరి ఇల్లు అనేది తెలియదు’ అని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఈ ఘటన జరిగింది.ఆయన, ఆయన కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా దుండగుడు సైఫ్ చిన్న కొడుకు జేహ్ గదిలోకి వెళ్లాడు.అతడ్ని చూసిన జేహ్ కేర్ టేకర్ కేకలేయడంతో అక్కడికి చేరుకున్న సైఫ్‌కు, ఆగంతకుడికి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయ పడ్డాడు.
Previous Articleఆ రాష్ట్రంలో మెట్రో ఛార్జీల పెంపు
Next Article దిల్ రూబా ఫస్ట్ సింగిల్ వచ్చేసింది…!