ప్రత్యేక అధికారాలతో వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది.జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేసేలా ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పటికే రెండు ఫెడరల్ కోర్టులు నిలిపివేశాయి.ఈ నేపథ్యంలో నిన్న మరో కోర్టు కూడా అదే విధంగా ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేస్తే వారికి ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా మరో కోర్టు నిలిపివేసింది.
కాగా ఈ ఉత్తర్వులను 22 రాష్ట్రాలు కోర్టులో సవాలు చేశాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఫెడరల్ జడ్జీలు ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేశారు.తాజాగా సియాటిల్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కఫెనార్ కూడా ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేస్తూ తీర్పు వెలువరించారు.