ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా టైఫాయిడ్ ను అరికట్టేందుకు భారత్
వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది.ఈ మేరకు పశ్చిమ బెంగాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశారు.కాగా ఈ వ్యాక్సిన్ సాల్మోనెల్లా టైఫీ,సాల్మోనెల్లా పారాటిఫై-ఏ ఇన్ఫెక్షన్ను నివారిస్తుందని చెబుతున్నారు.మనదేశంలో ప్రతి ఏడాది కోటిపైగానే టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయని సమాచారం.అయితే ప్రపంచవ్యాప్తంగా టైఫాయిడ్ రోగుల సంఖ్యలో భారత్ అగ్రస్థానంలో ఉంది.అయితే సాల్మొనెల్లా టైఫీ, సాల్మొనెల్లా పారాటైఫీ దేశంలో ఏటా కోటి మందికిపైగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.తాజాగా దీనికి వ్యాక్సిన్ తయారు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది.
అయితే ఇది టీబీ సంక్రమణ కంటే చాలా ఎక్కువ.ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉపయుక్తంగా ఉండనుందని ఐసీఎంఆర్ తెలిపింది.టైఫాయిడ్ ను తగ్గించేందుకు యాంటీబయాటిక్పై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని పేర్కొంది.టైఫాయిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరడం,తదితర ఆరోగ్య సంరక్షణ ఖర్చులను సైతం తగ్గిస్తుందని అభిప్రాయపడింది.రానున్న కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాక్సిన్పై ప్రయోగాలు ప్రారంభించనున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.