ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో …బీజేపీకి పట్టం కడుతూ..ఆమ్ ఆద్మీ పార్టీ కు ఢిల్లీ ప్రజలు షాక్ ఇచ్చారు.ఆ పార్టీ అధ్యక్షుడు ,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజరీ వాల్ కు కూడా సైతం పోటీ చేసిన చోట ఓటమి పాలయ్యారు.ఈ మేరకు విద్యావంతులు,ఉద్యోగులు ఓట్లు వేసే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులోనూ కేజ్రీవాల్ వెనుకబడ్డారు.అనంతరం మొదలైన ఈవీఎంల ఓట్ల లెక్కింపులో 2 & 3 రౌండ్లు స్వల్ప మెజార్టీ కనబర్చినప్పటికీ 200 నుండి 300 ఓట్లకు మించి అధిక్యం కనబర్చలేదు.అయితే మొత్తం 13 రౌండ్లకు గానూ మొదటి రౌండ్‌లో కేజ్రీవాల్‌పై పర్వేశ్ 74 ఓట్ల మెజార్టీ సాధించారు.2వ రౌండ్‌లో కేజ్రీవాల్ 328 ఓట్లు ఎక్కువ సాధించారు.దీనితో కేజ్రీవాల్ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు.
కాగా 3వ రౌండ్‌లో కేజ్రీవాల్ దాదాపు 90 ఓట్లు పర్వేష్‌పై ఎక్కువుగా సాధించారు.అనంతరం నాల్గవ రౌండ్ పర్వేష్ అధిక్యం సాధించగా..5వ రౌండ్‌లో కేజ్రీవాల్ అధిక్యాన్ని సాధించారు. 6,7,8,9,10 పర్వేష్ అధిక్యాన్ని సాధించారు.దీనితో పది రౌండ్లు ముగిసే సమయానికి పర్వేష్ కేజ్రీవాల్‌పై 1844 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.అయితే మిగిలిన 3 రౌండ్ల లెక్కింపు అనంతరం పర్వేష్ స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.