అమెరికా ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహారిస్తూ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాల నుండి అక్కడికి అక్రమంగా వెళ్లిన వారిని తిరిగి వారి వారి దేశాలకు పంపిస్తున్నారు. కొన్నిరోజుల కిందటే 104 మంది భారతీయులను కూడా అమెరికా ప్రభుత్వం సైనిక రవాణా విమానంలో భారత్ కు పంపించి వేసింది. తాజాగా, మరో 200 మంది అక్రమ వలసదారులను అమెరికా ప్రభుత్వం భారత్ కు తరలించనుంది. అక్రమ వలసదారులతో కూడిన రెండు విమానాలు భారత్ చేరుకోనున్నాయి. ఈ నెల 15న ఒక విమానం, ఈ నెల16న మరో విమానం భారత్ కు రానున్నాయి.
Previous Articleఅమెరికాలో మళ్లీ కనబడుతున్న ‘టిక్ టాక్ ‘
Next Article 76 వేల దిగువకు సెన్సెక్స్…23 వేల దిగువకు నిఫ్టీ