భారత ఎన్నికల సంఘం నూతన కమీషనర్ గా జ్ఞానేశ్ కుమార్ నియమితులైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎంపికపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సీఈసీ ఎంపికపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా లు అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. తదుపరి ఎన్నికల కమీషనర్‌ని ఎంపిక చేయడానికి కమిటీ సమావేశం సందర్భంగా, ప్రధాని మోడీ మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాల కి ఒక నివేదిక అందించినట్లు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. లోక్ సభలో ప్రతిపక్ష నేతగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మన జాతి వ్యవస్థాపక నాయకుల ఆదర్శాలను నిలబెట్టడం మరియు ప్రభుత్వానికి బాధ్యత వహించడం తన కర్తవ్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం లేని స్వతంత్ర ఎన్నికల కమిషన్లో అత్యంత ప్రాథమిక అంశం ఎన్నికల సంఘం కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ను ఎంపిక చేసే ప్రక్రియ. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ అర్ధరాత్రి వేళ నూతన సీఈసీని ఎంపిక చేశారు. ఇది మన ఎన్నికల ప్రక్రియపై కోట్లాది ప్రజల్లోని ఆందోళనలను తీవ్రతరం చేసిందని తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టులో 48 గంటల్లో విచారణ జరగనుండగానే మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని రాహుల్ పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు