మహిళలు ఎదుర్కొంటున్న కొన్ని రకాల క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు 9-16 ఏళ్ల లోపు వారు మాత్రమే అర్హులని తెలిపారు. ఈ వ్యాక్సిన్ పై రీసెర్చ్ కూడా పూర్తి కావొస్తున్నట్లు వివరించారు. మెడికల్ ట్రయల్స్ కొనసాగుతున్నట్లు తెలిపారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 30 సంవత్సరాలు దాటిన మహిళలకు హాస్పిటల్స్ లో టెస్టులు చేస్తారని తెలిపారు. ఈ వ్యాధిని ముందుగా గుర్తించేందుకు డేకేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్ రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుందని తెలిపారు.
5-6 నెలల్లో బాలికల కోసం అందుబాటులోకి రానున్న క్యాన్సర్ వ్యాక్సిన్
By admin1 Min Read