కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ఆర్థిక నిపుణుల పదవీకాలాన్ని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంకు మరో సంవత్సరం అవకాశం ఇచ్చింది. ఆయన 2023 ఫిబ్రవరి లో రెండు సంవత్సరాల పదవీ కాలానికి నియమితులయ్యారు. పదవీకాలం పూర్తి కావొస్తోన్న నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ నియామకాలు కమిటీ మరో సంవత్సరం పదవీకాలం పొడిగించింది. ఇక కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక అడ్వైజర్ వి.అనంత నాగేశ్వరన్ పదవీ కాలాన్ని రెండు సంవత్సరాలు పొడిగించింది. 2022 జనవరిలో ఆయన నియమితులు కాగా మూడు సంవత్సరాలు పూర్తి కావొస్తోన్న నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పిస్తూ పొడిగించింది. దీంతో 2027 మార్చి 31 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు