భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్నటి ‘మన్ కీ బాత్’ లో ఊబకాయం గురించి మాట్లాడారు. దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతుందని పేర్కొన్నారు.ఇక నిన్న చెప్పినట్లుగా, ఊబకాయంపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి మరియు ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేశారు. ఈ ఉద్యమం మరింత ముందుకు సాగాలంటే ఒక్కొక్కరు 10 మందిని నామినేట్ చేయాలని వారిని అభ్యర్థించారు. ఆనంద్ మహీంద్రా, నిరాహుయ హిందూస్తానీ, మను బాకర్, మీరాబాయి చానూ, మోహన్ లాల్, నందన్ నిలేఖనీ, ఒమర్ అబ్దుల్లా, నటుడు మాధవన్, శ్రేయా ఘోషల్, సుధా మూర్తిలను నామినేట్ చేశారు. సమిష్టిగా, భారతదేశాన్ని మరింత ఆరోగ్యంగా మరియు బలంగా మారుద్దామని పిలుపునిచ్చారు.
ఊబకాయంపై పోరులో భాగంగా 10 మంది ప్రముఖులను నామినేట్ చేసిన ప్రధాని మోడీ
By admin1 Min Read

