సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి.అయితే కాంగ్రెస్ నాయకుడు ,ఎంపీ రాహుల్‌గాంధీ గురించి తనకు తెలియదని సద్గురు గతంలో చెప్పడమే దీనికి కారణం.కాగా సద్గురు, డీకే కలయికపై హసన్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, సహకారశాఖ మంత్రి రాజన్న మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ఎవరో తనకు తెలియదన్న వ్యక్తిని డీకే కలవడం సరికాదని వ్యాఖ్యానించారు.రాహుల్ గాంధీ గురించి సద్గురు ఏం మాట్లాడారో తనకంటే డీకేకే ఎక్కువ తెలుసని అన్నారు.అయితే సద్గురు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడంపై శివకుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నేను హిందువుగా పుట్టానని, హిందువుగానే మరణిస్తా:-డీకె శివ కుమార్
ఈ విమర్శలపై డీకే తమ్ముడు సురేష్ స్పందించారు.అయితే సద్గురు స్వయంగా వచ్చి ఆహ్వానించడంతోనే తమ కుటుంబం శివరాత్రి వేడుకలకు హాజరైనట్లు వెల్లడించారు.మా అన్నయ్య శివకుమార్ రహస్యంగా ఎవరినీ కలవరని,ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయ్యే ముందు కూడా అధిష్ఠానానికి సమాచారం ఇచ్చారని చెప్పారు.అలానే కోయంబత్తూరులో ఈషా కార్యక్రమానికి హాజరవుతున్న సంగతి కూడా అధిష్ఠానానికి చెప్పారని వివరించారు.ఇటీవల డీకే శివకుమార్ మాట్లాడుతూ…నేను హిందువుగా పుట్టానని, హిందువుగానే మరణిస్తానని వ్యాఖ్యానించారు.\